దిల్లీలో 2012లో 19ఏళ్ల యువతిని రేప్ చేసి హతమార్చిన కేసులో దర్యాప్తు అనంతరం ముగ్గురు ఉత్తరాఖండ్ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని దోషులుగా తేలుస్తూ ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. వారు దిల్లీ హైకోర్టుకు వెళ్లగా ట్రయల్ కోర్టు తీర్పునే ఆ న్యాయస్థానం సమర్థిస్తూ 2014లో వారికి ఉరిశిక్ష ఖరారు చేసింది. దీంతో వారు సుప్రీంను ఆశ్రయించడంతో విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం వారి ఉరిశిక్షను రద్దు చేయడమే కాక వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పుచెప్పింది.