మహారాష్ట్రలోని పూణేలో గణేష్ రఖ్ అనే డాక్టర్ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. తమ ఆసుపత్రిలో పుట్టిన ఆడపిల్లల పుట్టుకకు సంబంధించిన ఆసుపత్రి ఛార్జీలను మాఫీ చేస్తున్నారు. తాను ఈ బేటీ బచావో మిషన్ ను దాదాపు 11 సంవత్సరాల క్రితం ప్రారంభించానని డాక్టర్ గణేష్ తెలిపారు. ఆసుపత్రిలో ఆడపిల్ల పుడితే బిల్లు మొత్తం మాఫీ చేస్తామని, ఆస్పత్రిలో కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకుంటామని చెప్పారు.