ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20 ఏళ్ల వేడుకకు చంద్రబాబుకు ముఖ్య అతిథిగా ఆహ్వానం అందింది. వచ్చే నెల 16న హైదరాబాద్ లో ఈ వేడుక జరగనుండగా ఐఎస్బీ డీన్ సోమవారం చంద్రబాబును కలిసి ఆహ్వానం పలికారు. 20 ఏళ్ల క్రితం సీఎం హోదాలో చంద్రబాబు ఐఎస్బీని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఐఎస్బీ వేడుకలకు తనకు ఆహ్వానం అందిన విషయాన్ని చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa