ప్రస్తుత చలి కాలంలో విటమిన్ సి సహా పోషకాలు అధికంగా ఉండే నారింజలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే నారింజలు అతిగా తింటే నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఫైబర్ అధికంగా చేరితే కడుపునొప్పి, వికారం వస్తాయి. నిద్రలేమి, వాంతులు, గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. శరీరంలో పొటాషియం స్థాయిలు పెరిగి హైపర్ కాలేమియా సమస్యకు దారి తీయొచ్చు.