గుత్తి మున్సిపాలిటీ పరిధిలో తాగు నీటి సమస్య నెలకొందని కలెక్టరు గారు స్పందించి ఆ సమస్య పరిష్కారం చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ వన్నూర్ బి కోరారు. సోమవారం ఆమె ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమా వేశంలో మాట్లాడుతూ గుత్తి మున్సి పాలిటీలోని అనేక వార్డులకు తాగు నీరు సరఫరా చేసే వైటిసి ప్రాజెక్టుకు చెందిన పంపుహౌస్ పామిడి పెన్నా నది వద్ద మునిగిపోయిందన్నారు. అంతేకాకుండా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పైపులైన్లు లీకేజీ అవు తున్నాయన్నారు. దీంతో 75 రోజు లుగా ప్రజలకు తాగునీటి సరఫరా ఆగిపోయిందన్నారు. సత్యసాయి మంచినీటి పథకంలో పనిచేసే కార్మికులు వేతనాలు రాకపోవడంతో సమ్మెలో ఉన్నారన్నారు. ఆ పథకం నీరు రాకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారన్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసు కెళ్లామన్నారు. కలెక్టర్ చొరవ తీసు కుని సత్యసాయి పథకం కార్మికు లకు బకాయి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుని ప్రజలకు తాగు నీటి కష్టాలు పరిష్కారం చేయాలని కోరారు.