చిరుధాన్యాల సాగుపై రైతులు మొగ్గుచూపాలని డిస్ట్రిక్ విజిలెన్సు మానిటరింగ్ కమిటీ సభ్యులు పైడిపల్లి కిశోర్ కోరారు. సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ చాలా కాలం నుంచి తృణధాన్యాలు జొన్న, కొర్ర, రాగి, సజ్జ అరికె తదితర పంటలు పట్ల రైతులు మక్కువ చూపలేదన్నారు. ఒకప్పుడు ఆహార కొరత తీర్చేందుకు చిరుధాన్యాలు ఎంతోఉపయోగపడ్డాయన్నారు. ఈ చిరుధాన్యాల వంటకాలు సైతం సగటు మనిషి. ఆరోగ్యానికి మిక్కిలి దోహదపడతాయని తెలిపారు. కిలో రెండు రూపాయలు ఆ తర్వాత కిలో రూపాయి బియ్యం వంటి పథకాలు అమలులోకి వచ్చిన తర్వాత చిరు ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు. కావున ఇవి పునర్ దర్శనం కావాలంటే పండించాలన్న ఉత్సాహం రైతులకు సాగుపై ప్రోత్సాహకం కల్పించాలన్న అవగాహన అధికారులకు ఉండాలని కిశోర్ వెల్లడించారు. ఆ దిశగా రైతులు విరివిగా ఆహార ధాన్యాల పంటలు సాగుచేస్తారని ఆయన ఆశించారు.