చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని కాగతి పంచాయతీ పరిధిలోని గ్రామాలు, కురపల్లి, మర్మాకులపల్లి, కరణం వారి పల్లి, కొత్త ఇల్లు, చిన్న ఓబునపల్లి, గుట్ట కింద పల్లి, గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మంగళవారం వైఎస్సార్ సీపీ శ్రేణులు నిర్వహించారు. మూడేళ్ల పాలన, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి మంత్రి పెద్దిరెడ్డి పీఏ మునితుకారం అడిగి తెలుసుకున్నారు.