దేశరాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి భూమి కంపించింది. అర్ధరాత్రి 1:57 నిమిషాలకు భూప్రకంపనలు మొదలయ్యాయి. సుమారు 20 సెకన్ల పాటు కొనసాగాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి కంపించింది. నేపాల్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ధోతి జిల్లాలో భూకంపం వల్ల ఇళ్లు కూలి, ఆరుగురు చనిపోయారు. ఆ ప్రభావం ఢిల్లీపై పడింది.