అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. మంగళవారం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ సీఎం జగన్ కు లేఖ రాశారు. కూతురు భర్త ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదంలో ఉన్నానని, నియోజకవర్గంతో పాటు జిల్లా అధ్యక్ష బాధ్యతలను చేపట్టడం కష్టంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. జిల్లా అధ్యక్ష పదవిని వేరొకరికి అప్పగించాలని ఆయన కోరారు.