తెనాలి , వైకుంఠపురం వద్ద ఉన్న షెడ్యూల్ తెగల కాలనీలో మంగళవారం ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ఎస్టీలందరికీ అందించాలని, లేనిపక్షంలో అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో గిరిజనుల సమస్యలను పరిష్కరించి వారి అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తామన్నారు. 40 ఏళ్ల నుంచి గిరిజనుల జీవన విధానంలో మార్పు రావడం లేదన్నారు. జీవితాల్లో మార్పు తెచ్చుకునేందుకు పిల్లలను తప్పకుండా చదివించాలని గిరిజనులకు సూచించారు. సబ్ కలెక్టర్ గీతాంజలిశర్మ, మున్సిపల్ చైర్మన్ ఖలేదానసీమ్, కమిషనర్ జస్వంతరావు, తహసీల్దార్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.