విశాఖ రాజధాని కోసం సీఎం జగన్ గట్టిగా నిలబడ్డారని ధర్మాన చెప్పారు. ‘ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖే ఉంటుంది. పరిపాలన అంతా ఇక్కడి నుంచే జరుగుతుంది. అమరావతికి ఏడాదికి మూడుమార్లు వెళ్లివస్తుంటాం. హైకోర్టు కోసం కర్నూలుకు వెళ్తుంటారు. ఈ ప్రాంతం నుంచి 0.001శాతం మందే హైకోర్టుకు వెళ్తుంటారు. చాలామంది మూడు రాజధానులని హేళన చేస్తున్నారు. 8రాష్ట్రాల్లో ఈ పద్ధతి ఉంది. రాజధాని ఓచోట.. హైకోర్టు మరోచోట ఉన్నాయి. వైజాగ్ రాష్ట్రానికి మధ్యలో ఉందా అంటున్నారు. హైౖదరాబాద్, కోల్‌కతా, చెన్నై నగరాలు సెంట్రల్‌లో ఉన్నాయా? ఏదో జడ్డోలు (పిచ్చోడు)కు చెప్పినట్లు చెబుతున్నారు. అని తెలియజేసారు.