ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అసిస్టెంట్ కన్జరేటర్ ఆఫ్ ఫారెస్ట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్టు శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి తెలిపారు. పరీక్ష నిర్వహణపై మంగళవారం ఆమె అధికారులతో సమీక్షించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో రెండు కేంద్రాల్లో బుధవారం నుంచి మూడు రోజుల పాటు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఎచ్చెర్లలోని వేంకటేశ్వర, శివానీ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 278 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని చెప్పారు.. బుధ, గురువారాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. 11న మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే పరీక్ష జరగనుందని చెప్పారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఈ మేరకు అభ్యర్థులకు ఎటువంటి కేంద్రాల వద్ద తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ సమస్యలకు అంతరాయం కలుగకుండా చూడాలని ఆదేశించారు. సందేహాల నివృత్తికి 9014550839 నంబరుకు సంప్రదించాలన్నారు. సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రెటరీ కుమార్ రాజా, ఏఎస్‌వో భోగేశ్వరి పాల్గొన్నారు.