దేశ వ్యాప్తంగా తాజాగా గవర్నర్ ల వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇందుకు కేరళ కూడా వేదికైంది. కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్‌కు పినరయి విజయన్ సర్కారు బుధవారం షాకిచ్చింది. గవర్నర్‌ను యూనివర్సిటీల ఛాన్సెలర్‌గా గవర్నర్‌ను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఛాన్సెలర్ పదవి నుంచి గవర్నర్‌ను తప్పిస్తూ ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌కు విజయన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తొమ్మిది యూనివర్సిటీలకు చెందిన వీసీలను తక్షణమే రాజీనామా చేయాలంటూ గతవారం గవర్నర్ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌కు అటువంటి ఆదేశాలిచ్చే అధికారాల్లేవని సీఎం విజయన్ విమర్శించారు. తర్వాత కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్.బాలగోపాల్‌ను పదవి నుంచి తొలగించాలంటూ గవర్నర్ లేఖ రాయడం మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో గవర్నర్ రాజ్‌భవన్ వేదికగా సమాంతర ప్రభుత్వాన్ని నడపాలని ప్రయత్నిస్తున్నారని అధికార పక్షం సీపీఎంతోపాటు విపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా గవర్నర్ చర్యను తప్పుబట్టాయి. కమ్యూనిస్ట్ సర్కారు, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య ఓ యుద్ధమే సాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై ఆయన బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. సోమవారం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని ధ్వజమెత్తారు. అంతేకాదు, సీపీఎం నాయకులకు తనపై దాడి చేసే దమ్ముందా? అని సవాల్ విసిరారు. నవంబరు 15 వరకూ ఎందుకు నేను రాజ్‌భవన్‌లో ఉన్నప్పుడు ముట్టిండించుకోవాలని రెచ్చగొట్టేలా మీడియా సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు.
గవర్నర్ వైఖరికి నిరసనగా నవంబరు 15న రాజభవన్‌ను ముట్టడిస్తామని అధికారపక్షం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని కేరళ సర్కారు ఆరోపిస్తోంది. గవర్నర్ పనితీరుపై చట్టబద్ధంగా, రాజ్యాంగపరంగా పోరాటం చేస్తామని ఇప్పటికే కేరళ సర్కారు ప్రకటించింది. అలాగే, పలు మీడియా సంస్థలపైనా ఇటీవల గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. కొన్ని ఛానళ్లు మీడియా ముసుగులో రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రెండు ఛానెళ్ల జర్నలిస్ట్‌లను తమ సమావేశం నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
గతేడాది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలకు కులపతిగా గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రిని నియమిస్తూ ముసాయిదా బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సీఎం మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగదీష్ ధనఖడ్ మధ్య విభేదాలు దేశం మొత్తాన్ని ఆకర్షించాయి. తాజాగా, కేరళ ప్రభుత్వం కూడా దీదీని ప్రేరణగా తీసుకుని గవర్నర్‌ను ఛాన్సెలర్ పదవి నుంచి తప్పించే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అటు, తెలంగాణాలోనూ ఇదే బిల్లును ప్రవేశపెట్టాలన్న యోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa