ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిడ్నాప్‌పై వినూత్న రీతిలో అవగాహన

national |  Suryaa Desk  | Published : Thu, Nov 10, 2022, 10:57 AM

అపరిచితులు తినుబండారాలు ఆశ చూపి, చిన్నారులను ఎత్తుకుపోతుంటారు. అయితే దీనిపై నర్సరీ చిన్నారులకు వినూత్న రీతిలో అవగాహన కల్పించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. తన్సు యెగెన్ అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను ఇటీవల పోస్ట్ చేశారు. అందులో చిన్నారులు ఉన్న గదిలోకి ఓ వ్యక్తి చిప్స్ ప్యాకెట్‌లతో కూడిన సంచితో వస్తాడు. చిన్నారులను తీసుకోమని కోరతాడు. ఓ బాలుడు చిప్స్ ప్యాకెట్ తీసుకోగా, అతడిని కిడ్నాప్ చేస్తున్నట్లు నటిస్తూ, బయటకు తీసుకెళ్తాడు. ఆ తర్వాత మరోసారి గదిలోకి వస్తాడు. అయితే అతడు తినుబండారాలు ఆశ చూపినా, చిన్నారులు ఎవరూ తీసుకోరు. భయంతో కొందరు ఏడుస్తారు. ఈ వీడియో నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa