జమ్మూకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మూ-పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై సాంబా వద్ద రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 ఏళ్ల బాలికతో సహా ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏడుగురు బాధితులను మెరుగైన వైద్యం కోసం ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు సాంబా జిల్లా ఆసుపత్రి వైద్యాధికారి భరత్ భూషణ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa