దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నేటికీ సరైన వసతులు ఉండడం లేదు. రోడ్లు, వంతెనలు కూడా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే క్రమంలో ప్రమాదకర వాగును ఓ బాలిక తాడుకు వేలాడుతూ దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ కాలమిస్ట్ వాలా అఫ్షర్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. చదువు కోసం చిన్నారులు పడుతున్న కష్టంపై నెటిజన్లు చలించిపోతున్నారు. మారుమూల ప్రాంతాల్లో సౌకర్యాలను ప్రభుత్వం మెరుగుపర్చాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa