బీహార్ లోని గయాలో దారుణం చోటుచేసుకుంది. మంత్రగత్తె అనే నెపంతో నవంబర్ 5న ఓ మహిళను సజీవదహనం చేశారు. అంతేకాకుండా బాధితురాలి కుటుంబంపైనా మూకుమ్మడి దాడి చేశారు. ఈ ఘటనలో కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం తీసుకున్నామని, 68 మంది నిందితులను గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే 17 మందిని అరెస్టు చేసినట్లు, బాధిత కుటుంబానికి రక్షణ, ఆర్థిక సాయం అందించినట్లు SSP హర్‌ప్రీత్ కౌర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa