గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం పెనగలూరు మండలం పొందలూరు గ్రామ సచివాలయ పరిధిలో పొందలూరు, హరిజనవాడ గ్రామాలలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల నుంచి వస్తున్న వినతులను, సమస్యలను అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో పరిష్కార దశగా ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీవో వరప్రసాద్, వీరనారాయణరెడ్డి, ధనుంజయ రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, శివయ్య నాయుడు, సానా రెడ్డి సర్పంచులు, ఎంపి టిసిలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.