మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పెనుమాక జిల్లా పరిషత్ హై స్కూల్ లో నాడు-నేడు పనులకు గురువారం ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ హనుమంతరావు లు శంకుస్థాపన చేశారు. తొలుత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శంకుస్థాపన చేసి అనంతరం పాఠశాల విద్యార్థుల చేతలమీదుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ పెనుమాక జిల్లా పరిషత్ హై స్కూల్ కు ఫేస్- 2 నాడు-నేడు ద్వారా 19 అదనపు తరగతి గదులు మరియు 10 కాంపోనెంట్స్ మొత్తం కలిపి రూ. 3 కోట్ల 41 లక్షల 11 వేలు మంజూరైనట్లు తెలిపారు. ఇందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కి ఎమ్మెల్యే ఆర్కే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులందరూ బాగా చదువుకోవాలని తద్వారా దేశం, సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa