నోయిడాలో మంగళవారం దారుణం జరిగింది. ఓ ప్రైవేటు కంపెనీలో జనరల్ మేనేజర్‌గా చేస్తున్న నీరజ్ సింగ్‌పై అత్యాచారం కేసు నమోదైంది. అతడిపై సహోద్యోగి అయిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కేసు నమోదైనప్పటి నుంచి సింగ్ పరారీలో ఉన్నాడు. మంగళవారం సాయంత్రం, సెక్టార్ 120లోని అమ్రపాలి జోడియాక్ సొసైటీలోని తన ఇంట్లో సింగ్ కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసుల రాకను పసిగట్టిన సింగ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అక్కడి సెక్యూరిటీ గార్డుపై కారును ఎక్కించాడు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు అశోక్ మావికి గాయాలయ్యాయి. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa