తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించి డిసెంబరు కోటా టికెట్లను టీటీడీ రేపు (నవంబరు 11) విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఈ టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. రూ.300 విలువ చేసే ఈ టికెట్లను వివిధ టైమ్ స్లాట్లలో కేటాయించనున్నారు. ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకుని వెబ్ సైట్ ద్వారా ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. అటు, తిరుమల కొండపై రద్దీ సాధారణంగా ఉండడంతో వెంకన్న దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 66,946 మంది దర్శించుకోగా, రూ.4.73 కోట్ల ఆదాయం లభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa