కార్పొరేటు, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఉరవకొండ నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గురువారం ఉరవకొండలో సెంట్రల్ ఉన్నత పాఠశాలలో రూ.77 లక్షలు, చౌడేశ్వరి కాలనీ ప్రాథమిక పాఠశాలలో రూ. 21 లక్షలు, లక్ష్మీ నరసింహ కాలనీ పాఠశాలలో రూ.60 లక్షలతో చేపట్టిన "నాడు నేడు" పథకం రెండో దశ కింద అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి విద్య, వైద్యం, సంక్షేమం అత్యంత ప్రధానమైన అంశాలు అని అన్నారు. అందులో భాగంగానే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రూ.1.58 కోట్లతో మనబడి నాడు-నేడు పనులకు శంకుస్థాపన చేశామన్నారు.