పండ్లు, కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది అని మనందరికి తెలుసు, కానీ పరగడపున వీటిని తింటే అనారోగ్యం బారిన పడతారని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయల్లో షుగర్, క్యాలరీలు, యాసిడ్లు ఉంటాయి. ఖాళీ కడుపుతో వీటిని తింటే డయాబెటిస్, అల్సర్ల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. టమాట, అరటి, కీరదోస, పుల్లటి పండ్లు, మామిడి, ఖర్జూరాలు వంటి వాటిని ఖాళీ కడుపుతో తింటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.