చిలకలూరిపేట కోండ్రుపాడుకి చెందిన అన్నదమ్ములు యాకసిరి దుర్గారావు(8), జగదీష్(7)కొండ్రుపాడు ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నారు. గత 4 రోజులుగా అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటున్నారు. గురువారం తల్లిదండ్రులు పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఇంటి వద్ద లేరు. ఆడుకుంటూ ఎటో వెళ్ళి ఉంటారని తల్లిదండ్రులు భావిస్తున్నారు. తెలిసిన వారు పోలీస్ స్టేషన్ లో తెలపాలని సిఐ రాజేశ్వరరావు తెలిపారు.