బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట శివన్నారాయణ గాజువాక పాతకర్నవానిపాలెం బీజేపి కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు అధ్యర్యంలో గురువారం సాయంత్రం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ ప్రారంభోత్సవాలు చేయడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిదిగా వెంకట శివన్నారాయణ పాల్గొని మాట్లాడుతూ గాజువాక నియోజవర్గం నుంచి భారీగా కార్యకర్తలు తరలివచ్చి ప్రధాని మోడీ కు ఘన స్వాగతం పలకాలని అన్నారు.
విశాఖలో నరేంద్రమోదీ గారి చేతులమీదుగా 9 ప్రాజెక్టులు. రూ. 15, 233 కోట్లతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అవి రూ. 152 కోట్లతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ. 3, 778 కోట్లతో రాయపూర్ -విశాఖ 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ఎకనామిక్ కారిడార్. 566₹ కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుండి షీలానగర్ కి ప్రత్యేకమైన రోడ్డు రూ.460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి రూ. 2, 658 కోట్లతో శ్రీకాకుళం -అంగుల్ కు గెయిల్ పైప్ లైన్ , రూ. 211 కోట్లతో పాతపట్నం-నరసన్నపేటను కలుపుతూ నిర్మించిన నూతన జాతీయ రహదారి. రూ. 2, 917 కోట్లతో తూర్పుతీరంలో అభివృద్ధి చేసిన ఓఎన్‌జీసి యు-ఫీల్డ్. రూ. 385 కోట్లతో గుంతకల్లు ఐవోసీఎల్ గ్రాస్‌రూట్ పీవోఎల్ డిపో నిర్మాణం. రూ. 4, 106 కోట్లతో విజయవాడ-భీమవరం-నిడదవోలు. గుడివాడ-మచిలీపట్నం. భీమవరం నరసాపురం 221కిమీ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి యొక్క బిజెపితోనే సాధ్యమని కుటుంబ పార్టీలైన టిడిపి వైసిపి వల్ల కాదని అన్నారు. కార్యక్రమంలో ఎన్ ఎఫ్ డి బి మెంబర్ సిరసపల్లి నూకరాజు బాటా శ్రీను మండల జిల్లా ఉపాధ్యక్షులు దేనంకొండ కృష్ణంరాజు , మండల అధ్యక్షులు గూటూరు శంకర్రావు కట్టా పద్మ నాగేశ్వరరావు ముసలయ్య పేర్ల అప్పారావు సత్తిబాబు తాతారావు తదితరులు పాల్గొన్నారు.