విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెంటర్లో కొనసాగాలని అలాగే మిగిలి ఉన్న ప్రతి నిర్వాసితులందరికీ శాశ్వత పరిష్కారం చేయాలని , విశాఖ నిర్వాసితులు గత కొన్ని నెలల ముందు హైకోర్టు కోర్టుని ఆశ్రయించారు. నిర్వాసితుల తరఫున సీనియర్ లాయర్ కోటేశ్వరావు, సిబిఐ జెడి లక్ష్మీనారాయణ తరపున సీనియర్ లాయర్ఆదినారాయణ కూడా స్టీల్ ప్లాంట్లో ఉద్యోగస్తుల భవిష్యత్తు కోసం నిర్వాసితుల కోసం పిటిషన్ వేయడం జరిగింది. దీనికిగాను గురువారం హైకోర్టులో వాదనాలు వినిపించారు. దీనికి గవర్నమెంట్ లాయర్లు మరొక వారం రోజులు గడువు అడగడం తో జడ్జి మరొక వారం రోజులు ఈ కేసును వాయిదా వేశారు. కోర్టుకి హాజరైనవాళ్లు సంఘం అధ్యక్షులు జి. ధనలక్ష్మి. యూనియన్ అధ్యక్షులు భాస్కర్ రావుపితాన, జనరల్ సెక్రెటరీ డి ఎస్ వి నర్సింహా , ఉపాధ్యక్షులు సండ్రాన పెంటారావు తదితరులు పాల్గొన్నారు.