పరవాడ మండల పరిషత్ కార్యాలయంలో పెందుర్తి శాసనసభ్యులు అదీప్ రాజ్ ఎన్టిపీసి పొల్యూషన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న కలపాక పంచాయతీ మూల స్వయంబువరం గ్రామం సందర్శించి నివేదికలు అందచెయ్యమని అధికారులు ను ఆదేశించిన విషయం గురించి గురువారం ప్రస్తావించి నివేదిక లు సమర్పించమని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ మరియు గ్రామీణ త్రాగు నీటి సరఫరా శాఖ , పంచాయతీ రాజ్ మరియు హౌసింగ్ శాఖ అధికారులు, స్థానిక ఎంపీడీఓ గారి ద్వారా తయారు చేసిన నివేదికలను స్థానిక ఎమ్మెల్యేకి సమర్పించారు.
నివేదిక లో ఎన్టిఫిసి పొల్యూషన్ మరియు కూలింగ్ టవర్స్ నుంచి వస్తున్న వ్యర్థ నీటి తుంపర్లు మరియు విషవాయువులు వలన గ్రామం లో ఉన్న 168 ఇల్లులు పాక్షికంగా మరియు పూర్తిగా ధ్వంసం అయినట్టు మరియు ప్రజలు ప్రాణాంతక వ్యాధులు తో బాధపడుతున్నట్టు , గ్రామంలో చర్మ వ్యాధులు మరియు కిడ్నీ వ్యాధి గ్రస్తులు మరియు క్యాన్సర్ వ్యాధి గ్రస్తులు మరియు కండరాల బలహీనత మరియు ఎముకల వ్యాధి తో బాధపడుతున్నట్టుగా నివేదిక లో అధికారులు ఎమ్మెల్యే దృష్టి కి తీసుకువెళ్లారు.
దీని పై ఎమ్మెల్యేకలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి, సమస్య పరిష్కరనికి 12 వ తేదీన విశాఖ వస్తున్న ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి కి , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి రిపోర్ట్ చేస్తామని తద్వారా పొల్యూషన్ పై నియంత్రణ కు చట్టపర్యమైన చర్యలు తీసుకోవాలని కొరతమని పొల్యూషన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని వారికి తగిన న్యాయం చేస్తాం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు పి. ఎస్. రాజు, రాష్ట్ర సి ఇ సి సభ్యులు పైల శ్రీనివాసరావు, ఎంపీడీఓ హేమ సుందర రావు, పరవాడ వైస్ ఎంపీపీ లు బంధం నాగేశ్వరరావు, బుస అప్పలరాజు, అన్ని శాఖల అధికారులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, పంచాయతీ కార్యదర్శి లు, పాల్గొన్నారు.