రణస్థలం మండలంలోని మెంటాడ పంచాయతీ దోనిపేట వద్ద సముద్రంలో స్నానానికి వెళ్లి గల్లంతైన శంకర్ శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. చంద్రగ్రహణం మరుసటి రోజైన బుధవారం సముద్ర స్నానం చేస్తే మంచిదని శంకర్ గ్రామ సమీపంలో సముద్రంలో స్నానానికి ఒక్కడే వెళ్లి గల్లంతయ్యారు.
ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సముద్రంలో వెతకసాగారు. బుధవారం రాత్రికి మృతదేహం ఒడ్డుకు రావడంతోగురువారం శవపంచనామా నిమిత్తం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. శంకర్ కుఆరు నెలల కిందట అదే గ్రామానికి చెందిన దుర్గ అనే యువతితో వివాహం జరిగింది. తండ్రి చిన్నప్పుడే మృతి చెందడంతో తల్లిముసలమ్మ. ముగ్గురు కుమారులను పెంచింది. శంకర్ మధ్యవాడు. శంకర్ మృతితో భార్య దుర్గ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జె. ఆర్. పురం ఎస్సై జి. రాజేష్ కేసు నమోదు చేశారు.