డార్క్ చాక్లెట్లు, నట్స్, అవిసె గింజలు, చేపలు తింటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. గ్రీన్ టీ, బ్లాక్ టీ కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. తృణదాన్యాలు, ఆలివ్ నూనె, తాజా కూరగాయలు, పండ్లు, ఓట్స్, బార్లీ గింజలు, సోయాబీన్స్, పప్పు దాన్యాలు, చిక్కుళ్లు, యాపిల్, నారింజ, నిమ్మ, బాదం, వెన్న, పసుపులను ఆహారంలో భాగం చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు.