నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో శారదా నగర్ బైపాస్ రోడ్డు వద్దగల వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 27 నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాలు అతి వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు శేఖర్ స్వామి శుక్రవారం తెలిపారు. ఈ ఉత్సవాలు ఈనెల 29వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు ఉత్సవాల్లో భాగంగా 27న విగ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం సుబ్రమణ్య స్వామికి 60 లీటర్ల పాలతో క్షీరాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు సాయంత్రం రాహు కేతు పూజలు జరుగుతాయన్నారు. 28న సుబ్రమణ్య స్వామికి విభూతి అభిషేకం, 10 గంటలకు హోమం, సాయంత్రం 6 గంటలకు కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 29న అభిషేకాలు మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.