కర్ణాటకలోని మస్కి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. కురేకల్లూరుకు చెందిన మేఘన, బాగల్ కోట జిల్లా ఇలకల్ నివాసి ముత్తన్న నాయక్ 6 నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో కలత చెందిన వీరు బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో అక్కడ విషాదం నెలకొంది. ఇద్దరి వయస్సు 18 సంవత్సరాలు.