సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో పరాభవం పాలైన టీమిండియా స్వదేశానికి తిరిగొస్తోంది. దీనిపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ కప్ సాధించాలన్న కల నెరవేరకుండానే ఆస్ట్రేలియా వీడుతున్నామని, హృదయాలు తీవ్ర నిరాశతో నిండిపోయాయని తెలిపాడు. ఈ టోర్నీలో ఎన్నో మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకున్నామని, భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తామని అన్నాడు. భారత్ కు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావిస్తానని తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa