ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీని కలిసిన పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 11, 2022, 10:16 PM

ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధాని మోదీని కలిశానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ చోళలో ప్రధాని మోదీతో అరగంటకు పైగా ఆయన మాట్లాడారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. 8 ఏళ్ల తర్వాత తాను ప్రధాని మోదీని కలిశానని చెప్పారు. ఏపీ బాగుండాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని మోదీ అడిగి తెలుసుకున్నారు అని తెలిపారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నానని పవన్ అన్నారు.  ఈ కీలక సమావేశానికి పవన్‌ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com