విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీక రణను ఆపాలని సీపీఐ తాలుకా కార్యదర్శి రంగయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక యల్లనూరు రోడ్ సర్కిల్ వద్ద శుక్రవారం ప్రధాని నరేం ద్రమోదీ విశాఖ పర్యటనకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రంగయ్య మాట్లా డుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరణ ఆపాలని, పెరిగిన డీజల్, గ్యాస్, పెట్రోలు, నిత్యావ రస వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. నాయకులు నాగరంగయ్య, సురేష్, నారాయణరెడ్డి, రామలక్ష్మి, రమణ తదితరులు పాల్గొన్నారు.