ఫోన్ ఛార్జింగ్ చేసేటప్పుడు నాసిరకం ఛార్జర్లని వినియోగించకపోవడం మంచిది. ఛార్జింగ్ విషయంలో కంపెనీ ఛార్జర్లనే వాడండి. ఫోన్ ఛార్జ్ అవుతుండగా కాల్స్ మాట్లాడటం చాలా ప్రమాదం. ఒక వేళ తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే ఛార్జింగ్‌ను ఆఫ్ చేసి మాట్లాడండి. రాత్రివేళ్లలో నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్‌ను ఆఫ్ చేయటం ఉత్తమం. దీనివల్ల బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు. వేడి వాతావరణంలో ఫోన్‌ను ఉంచటం అంత మంచిదికాదు.