ఉత్తరాంధ్ర గడ్డపై ప్రధాని మోదీ కి సీఎం జగన్ స్వాగతం పలికారు. విశాఖ సభలో జగన్ మాట్లాడుతూ.. మోదీతో అనుబంధం రాజకీయాలకు అతీతమన్నారు. ఉత్తరాంధ్ర జనం ప్రభంజనం మాదిరిగా కదిలి వచ్చిందన్నారు. విజయనగరం వాసి గురజాడ మాటలు కర్తవ్య బోధన చేస్తున్నాయన్నారు. మూడున్నరేళ్లుగా ఏపీ సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు. వికేంద్రీకరణ, పారదర్శకతతో పాలన సాగిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. విభజన గాయం నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదన్నారు. రాష్ట్రం ఇప్పుడే నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఏపీని కేంద్రం తగిన విధంగా ఆదుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకూ చాలా విజ్ఞప్తులు చేశామన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులకు మీ సహకారం ఉండాలన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప... మరో అజెండా లేదన్నారు.