ఆకాశంలో దూసుకెళ్లే విమానం శుక్రవారం ఉదయం తడ మండలం భీములవారిపాళెం చెక్‌పోస్టు వద్ద ఓ లారీపై కనిపించడంతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. విషయమేంటని ఆరా తీస్తే.. ఎయిర్‌ఇండియాకు చెందిన ఈ విమానం మరమ్మతులకు గురవడంతో చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాదుకు తరలిస్తున్నారని తెలిసింది. ఇది మనరాష్ట్రం మీదుగా వెళ్లడానికి అనుమతులు లేకపోవడంతో చెక్‌పోస్టులోని రవాణాశాఖ పన్నుల రూపంలో రూ.20వేలను వసూలు చేసిందని ఏఎంవీఐ కె.ప్రభాకర్‌రావు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa