సంగం, స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ సిబ్బందికి జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం రీసర్వేపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. మండలంలో త్వరలో చేపట్టబోయే రీసర్వేపై డిప్యూటీ సర్వేయర్ శ్రీనివాసులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు లక్ష్మీప్రసన్న, ఈవోఆర్డీవో అప్పాజీ, సర్వేయర్ శోభన్‌బాబు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లు, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.