రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ధాన్యాన్ని సేకరించి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తామని సామర్లకోట, పరిధిలో కలెక్టర్ కృతికాశుక్లా స్పష్టం చేశారు. సామర్లకోట మండలం కెనాల్ రోడ్డు లో ధాన్యం కొనుగోళ్లు నిర్వహిస్తున్న తీరును పరిశీలనకు శుక్రవారం ఆమె సామర్లకోట మండలం వేట్లపా లెంలోని పొలాల్లో మాసూళ్ల పనుల్లో ఉన్న రైతుల వద్దకు నేరుగా వెళ్లారు. జిల్లాలో ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ సజావుగా సాగేందుకు క్షేత్రస్థాయి అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. 2022-23 ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైన నేపథ్యంలో వేట్లపాలెంలోని పౌరసరఫరాల, వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులతో ఆమె క్షేత్రస్థాయిలో శుక్రవారం తనిఖీలు, సమీక్షలు నిర్వహించారు.