బార్లీ ఫేషియల్ తో చర్మంపై ఉన్న మచ్చలు, మొటిమలకు చెక్ పెట్టవచ్చు. ఇందుకోసం రెండు చెంచాల బార్లీ గింజల పొడి, సరిపడా గోరువెచ్చటి నీళ్లు తీసుకోవాలి. బార్లీ గింజల పొడిలో గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై నల్ల మచ్చలు ఉన్న చోట పూయాలి. దానిని అలానే ఓ 15 నిమిషాల పాటు ఆరబెట్టాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. కొన్ని రోజులు ఇలా చేస్తే చర్మంపై మచ్చలు తొలగిపోతాయి.