ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను గొంతుకోసి చంపాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. జగన్నాథపురం కు చెందిన సింహాద్రి(60) తన భార్య ఉమ(52) ను శనివారం అర్ధరాత్రి దాటిన కత్తితో గొంతుకోసి హత్యచేశాడు. అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సింహాద్రి ఈ దారుణానికి పాల్పడటానికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa