అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. ఉరవకొండ పట్టణంలోని కొండను వేకువజామున నుంచి ఉదయం 8 గంటల వరకు పొగ మంచు కమ్మేయడంతో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. ఉరవకొండ జాతీయ రహదారిపై పొగ మంచు కారణంతో ముందు వచ్చే వాహనాలు కనబడలేకపోతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.