శ్రీకాకుళం జిల్లాలోని నందిగాం మండలం పెద్దనాయుడుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుండి పలాసకు వస్తున్న కారు అదుపుతప్పి వంతెనకు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న పలాస ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ రమేశ్ తో పాటు ఆయన కుమారుడు సంకల్ప్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన భార్య ప్రసన్న, కుమార్తె సైర్యకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa