రామకుప్పం మండలం చెలిమిచేనుతాండా సమీపంలోని చెలిమిచేను జలపాతం ప్రకృతి అందాలకు నెలవుగా మారింది. గత కొన్ని నెలలుగా కురుస్తున్న వర్షాలకు జలపాతానికి భారీగా నీరు చేరుకుంటోంది. సోమవారం చెలిమిచేను జలపాతంలో నీరు ఉధృతంగా వస్తోందని స్థానికులు పేర్కొన్నారు. చెలిమిచేను జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. జలపాతం ద్వారా నీరు మొత్తం వృధాగా తమిళనాడు రాష్ట్రానికి వెల్లిపోతోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.