తెలుగు దేశం, బీజేపీ, జనసేన పార్టీలను కలపడమే పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. అందుకే పవన్‌కు ప్యాకేజీ ఇస్తున్నారని చెప్పారు. ప్రధాని విశాఖ వచ్చిన సందర్భంలో నరేంద్రమోదీని పవన్ రాష్ట్రానికి ఏం కావాలని అడిగారు?. ప్రత్యేక హోదాపై పవన్ కేంద్రాన్ని నిలదీశారా? అని ప్రశ్నించారు. వైయస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మార్గాని భరత్ సోమవారం మీడియాతో మాట్లాడారు.