ఎన్టీఆర్ జిల్లాలోని విసన్నపేటలో పుట్రేల రోడ్డులో ఓ బిల్డింగ్ వద్ద బాలుడి మృతదేహం కలకలం రేపుతోంది. విసన్నపేట మండలంలోని కొర్రతండాకు చెందిన కుర్ర అంకిత్(17)గా గుర్తించారు. విసన్నపేటలో ప్రజ్ఞ ప్రైవేట్ పాఠశాలలో బాలుడు 10వ తరగతి చదువుతున్నారు. బాలుడి వెనుక ఇద్దరు వెంట పడ్డారని ఆ క్రమంలో కొద్దిసేపటి తర్వాత ఒకేసారి శబ్దం వచ్చినట్లుగా స్థానికుల చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద కేసుగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa