శ్రీకాకుళం జిల్లా పలాస నియోజవర్గం మందస మండలం హరిపురంలో ఇద్దరు మహిళలపై కంకరమట్టి పోసిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దానికి సంబంధించిన వీడియోను పవన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వైసీపీ చట్ట వ్యతిరేక కార్యకలాపాకు, అరాచకాలకు ఈ వీడియో నిదర్శనమంటూ జనసేనాధిపతి ట్వీట్ చేశారు. ‘‘హరిపురంలో కొట్రు దాలమ్మ, ఆమె కుమార్తె మజ్జి సావిత్రిపై కంకరమట్టి పోశారు. ముసలామె 'నేను చచ్చిపోతున్నాను' అని రోధిస్తున్నా.. చచ్చిపో అని హెచ్చరించే ఓ కంఠంలోని కాఠిన్యానికి దన్నుగా నిలిచే వ్యవస్థ ఎవరిది?’’ అంటూ పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa