జగనన్న ఇళ్ళు - పేదోళ్ళ కన్నీళ్ళు అనే సామాజిక పరిశీలన భాగంగా సోమవారం సోషల్ ఆడిట్ కార్యక్రమం నిర్వహించిన జనసేన నాయకులు పెనుకొండ పట్టణంలోని స్థానిక సచివాలయం ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలోని డి ఈ ని కలిశారు. ఈ సందర్బంగా ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్ల పై జనసేన నాయకులు సమాచారం కోరారు. నిర్మిస్తున్న ఇళ్లు ఎంతవరకు పూర్తయ్యాయి అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లకు కనీస సౌకర్యాలు రోడ్లు, నీరు సౌకర్యం కల్పించకుండా నిర్మిస్తున్నారన్నారు. ఇలా నిర్మిస్తే ప్రజలు ఎన్ని ఇబ్బందిలకు గురవుతారనే జ్ఞానం కూడా లేకపోతె ఎలా అంటూ స్థానిక ఎమ్మెల్యే శంకర్నారాయణపై అధికార పార్టీ నాయకుల పై విమర్శలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa