చంద్రబాబు కుప్పంలో.. లోకేష్ మంగళగిరిలో గెలిచే పరిస్థితి లేదని.. తండ్రీ కొడుకుల రాజకీయ భవిష్యత్తు దొందూ దొందే.. అన్నట్టుగా తయారైందని చీరాల అసెంబ్లీ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ ఇన్ చార్జి కరణం వెంకటేష్ అన్నారు. 14 ఏళ్ళు అధికారంలో ఉండి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలో కనీసం అవగాహన లేని, స్పష్టత లేని నాయకుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఆయనను ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. అధికారం లేదు అన్న ఒకే ఒక్క అక్కసుతో.. చంద్రబాబు, ఎల్లో మీడియా, పవన్ కల్యాణ్ లు.. జగన్ మోహన్ రెడ్డిగారి ప్రజా ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని, వీరి కుట్రలను ప్రజలే తిప్పికొడతారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, 2024 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిగారికే అధికారం తథ్యం అని కరణం వెంకటేష్ అన్నారు.