ఈ ప్రభుత్వ పనితీరును పోల్చాలంటే గత ప్రభుత్వంతోనే కదా? అంతకన్నా మెరుగ్గా చేశారా లేదా అన్నదే కదా ప్రామాణికం. ఎందుకంటే వై.ఎస్.జగన్ సర్కారు బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచీ చక్కని వర్షాలు పడ్డాయి. పంటలూ విరగపండాయి. మునుపటితో పోలిస్తే నష్టం తక్కువ జరిగినా... ప్రతి ఎకరాన్నీ పరిగణనలోకి తీసుకోవటంతో... గడిచిన మూడున్నర ఏళ్లలో ఏకంగా 44.66 లక్షల మందికి బీమా పరిహారమిచ్చింది ఈ సర్కారు. వారికి చెల్లించిన మొత్తం ఏకంగా రూ.6684.84 కోట్లు. ఈ రెండింటికీ అసలు ఏ కొంచమైనా పోలిక ఉందా? మరి గతంలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి కూడా బీమా పరిహారం చెల్లించలేదని రైతుల తరఫున ఒక్క అక్షరమైనా ‘ఈనాడు’ రాసిందా? ఎందుకు పెన్నెత్తలేదు రామోజీ? ఇప్పుడెందుకు ఇంత మేలు చేస్తున్న ప్రభుత్వంపై అదేపనిగా బురద జల్లుతున్నారు? ‘బీమా ఆశలపై నీళ్లు’ అంటూ సోమవారం పతాక శీర్షికల్లో అచ్చేసిన కథనం దేనికి చిహ్నం? అని వైసీపీ నాయకులూ వాపోతున్నారు.